టీజర్ తో గోపిచంద్ రెడీ

Saturday,June 02,2018 - 10:02 by Z_CLU

టాలీవుడ్‌ యాక్ష‌న్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘పంతం’. `ఫ‌ర్ ఎ కాస్‌` అనేది ఉప శీర్షిక‌. ఈ సినిమాను జూలై 5న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 5న ఉదయం 11 గంటలకు సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నారు.

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె. రాధామోహ‌న్ నిర్మిస్తున్న ఈ సినిమాతో  `బ‌లుపు`, `ప‌వ‌ర్‌`, `జై ల‌వకుశ` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు స్క్రీన్‌ప్లే అందించిన కె.చ‌క్ర‌వ‌ర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

గోపీచంద్ న‌టిస్తోన్న 25వ చిత్ర‌మిది.  మెహరీన్‌ కథానాయికగా నటిస్తుస్తుంది.   ప్ర‌స్తుతం లండన్‌, స్కాట్‌లాండ్‌లోని అందమైన లొకేషన్లలో పాటలు చిత్రీకరణ జరుగుతుంది