డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో 25వ సినిమా

Wednesday,March 21,2018 - 02:04 by Z_CLU

గోపీచంద్ ‘పంతం’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజయింది. గోపీచంద్ కరియర్ లో ఇది 25 వ సినిమా కావడంతో న్యాచురల్ గానే ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. డిఫెరెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ  సినిమాలో గోపీచంద్ స్టైలిష్ లుక్ లో మెస్మరైజ్ చేయనున్నాడని తెలుస్తుంది.

అల్టిమేట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఇంటర్నల్ గా కాంటెంపరరీ మెసేజ్ తో తెరకెక్కుతుంది ‘పంతం’. ఈ సినిమాలో మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఇప్పటికే 60% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని మే 18 న రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.

గోపీసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి K. K. రాధా మోహన్ ప్రొడ్యూసర్. పృథ్వీ, జయప్రకాష్ రెడ్డి ఈ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.