గోపీచంద్ 'ఆక్సిజన్' ట్రైలర్

Saturday,September 30,2017 - 01:15 by Z_CLU

గోపీచంద్ ఆక్సిజన్ ట్రైలర్ రిలీజయింది. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా తెలుస్తుంది. అద్భుతమైన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ తో ఫాఫీగా సాగిపోతున్న హీరో లైఫ్ లో జరిగిన ఒక సంఘటన, తన వాళ్ళను శాశ్వతంగా దూరం చేసేస్తుంది. ఆ పరిస్థితుల్లో హీరో ఏం చేస్తాడు..? అనే కీ పాయింట్ తో తెరకెక్కిన ఈ రివేంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇంటరెస్టింగ్  ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేస్తుంది.

 

అక్టోబర్ 12 ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన అనూ ఇమ్మాన్యువెల్, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటించారు.  యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కపోజ్ చేసిన ఈ సినిమాకి A.M. జ్యోతికృష్ణ డైరెక్టర్. S. ఐశ్వర్య ప్రొడ్యూసర్.