కొత్త దర్శకుడితో గోపీచంద్.. త్వరలోనే సెట్స్ పైకి

Sunday,December 02,2018 - 11:08 by Z_CLU

యాక్షన్ హీరో గోపీచంద్ కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. తిరు సుబ్రహమణ్యం అనే డెబ్యూ డైరెక్టర్ చెప్పిన థ్రిల్లర్ కథకి ఇటివలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోపీచంద్ త్వరలోనే ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుందని సమాచారం.

గోపీచంద్ ఫస్ట్ టైం థ్రిల్లర్ స్టోరీతో చేయబోతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.