సెట్స్ పైకి రానున్న గోపీచంద్ కొత్త సినిమా

Thursday,March 15,2018 - 10:03 by Z_CLU

ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ K. చక్రవర్తి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘పంతం’ సినిమాతో బిజీగా ఉన్నాడు గోపీచంద్. అయితే మరోవైపు తన నెక్స్ట్ సినిమా విషయంలో కూడా అప్పుడే కాన్సంట్రేట్ చేయడం బిగిన్ చేసేశాడు. ఉగాది సందర్భంగా మార్చి 18న తన కొత్త సినిమాని సెట్స్ పైకి తీసుకురానున్నాడు గోపీచంద్.

గతంలో ‘హైపర్’ సినిమాకు దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. B.V.S.N ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై తెరకెక్కనుంది. ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, సంతోష్ శ్రీనివాస్ ఆల్మోస్ట్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేశాడని తెలుస్తుంది. ఈ టాక్ అఫీషియల్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుందా..? లేక జస్ట్ గాసిప్ లా మిగిలిపోనుందా అనేది ఉగాది రోజు తేలిపోతుంది.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘పంతం’ సినిమాని మే 18 న రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.