జనవరి నుండి గోపీచంద్ కొత్త సినిమా

Saturday,December 22,2018 - 03:49 by Z_CLU

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్ అయింది. జనవరి 18 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది సినిమా యూనిట్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన మేకర్స్, ఈ సినిమాలో గోపీచంద్ ని డిఫెరెంట్ ఫార్మాట్ లో ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు.

ఈ సినిమా స్టోరీలైన్ ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్న మేకర్స్, స్పై థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని చెప్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నటించనున్న హీరోయిన్ ని ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది.

A.K. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రామబ్రహ్మం సుంకర ఈ సినిమాకి ప్రొడ్యూసర్. ఈ సినిమాని మే నెలలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్.