నెక్ట్స్ మూవీపై గోపీచంద్ క్లారిటీ

Thursday,August 29,2019 - 12:32 by Z_CLU

నాగార్జున హీరోగా గోపీచంద్ మలినేని సినిమా
మన్మథుడు-2 తర్వాత సెట్స్ పైకి వచ్చేది ఇదే
ఇలా వారం రోజులుగా నాగార్జున అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై రూమర్ నడుస్తూనే ఉంది. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. సోషల్ మీడియాలో వినిపిస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ.. తన నెక్ట్స్ మూవీ రవితేజ తో ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.

గతంలో రవితేజ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో డాన్ శీను సినిమా వచ్చింది. గోపీచంద్ కు దర్శకుడిగా అదే ఫస్ట్ మూవీ. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి బలుపు అనే సినిమా కూడా చేశారు. ఆ రెండూ హిట్ అయ్యాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో ఉన్నారు. సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ నడుస్తోందని ప్రకటించాడు గోపీచంద్ మలినేని.

అటు రవితేజ ప్రస్తుతానికి బిజీగా ఉన్నాడు. డిస్కోరాజా షూటింగ్ ను త్వరలోనే పూర్తిచేయబోతున్నాడు. ఆ వెంటనే అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం మూవీని స్టార్ట్ చేస్తాడు. ఆ టైమ్ కు గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ కూడా రెడీ అయితే.. రెండు సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేస్తాడు మాస్ మహారాజ్.