Gopichand Malineni నెక్ట్స్ హీరో ఎవరు ?

Sunday,January 17,2021 - 02:43 by Z_CLU

ఈ ఏడాది సంక్రాంతి కి ‘Krack’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ కి వరుస ఆఫర్స్ వస్తున్నాయట. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే తమతో ఓ యాక్షన్ సినిమా చేయాలని గోపిని అడుగుతున్నారట హీరోలు. ఇప్పటికే ఓ టాప్ హీరో తనకోసం గోపిని కథ సిద్దం చేయమని చెప్పాడట. ‘క్రాక్’ షూటింగ్ స్టేజిలో ఉండగానే ఓ యాక్షన్ కథను సిద్దం చేసిన గోపీచంద్ తాజాగా ఆ హీరోని కలిసి పది నిమిషాల పాటు నరేషన్ ఇచ్చాడని తెలుస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆ టాప్ హీరోతో గోపీచంద్ మలినేని సినిమా ఉంటుందని టాక్. మరి ఈ ఏడాది క్రాక్ తో సంక్రాంతి సందడి చేసిన ఈ డైరెక్టర్ తో సినిమా చేయనున్న ఆ స్టార్ హీరో ఎవరనేది మరికొన్ని రోజుల్లోనే బయటికి రానుంది. అప్పటి వరకు గోపీచంద్ మలినేని నెక్స్ట్ హీరో ఎవరనేది సస్పెన్స్ గానే ఉండనుంది.