నన్ను చిరంజీవి పూర్తిగా మార్చేశారు

Saturday,July 11,2020 - 03:48 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి తన యాటిట్యూడ్ ను పూర్తిగా మార్చేశారని చెబుతున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. తనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చింది రవితేజ అయితే.. వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ గా మరింత ఎదగడానికి చిరంజీవి మాటలు బాగా సాయపడ్డాయని చెబుతున్నాడు.

“నేను చాలా ఇంట్రోవర్ట్. పైకి ఏదీ చెప్పను. చిరంజీవి హీరోగా నటించిన అందరివాడు సినిమాకి నేను అసోసియేట్ గా వర్క్ చేశాను. సినిమా దాదాపు ఫినిషింగ్ కు వచ్చినప్పుడు ఓసారి చిరంజీవి గారు పిలిచారు. ఈ సినిమాలో కేవలం నీవల్ల 15-20 ఎక్స్ ట్రా టేకులు చేశానని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. షాట్ అయిన తర్వాత నా ఫేస్ తృప్తిగా ఉందా లేక డౌట్ గా ఉందా అనేది చిరంజీవి చూసేవారు. నేనేదైనా అనుమానంగా ఎక్స్ ప్రెషన్ పెడితే రీటేక్ చేసేవారు.”

సినిమా పూర్తయ్యేంత వరకు చిరంజీవి గారు తనను ఈ కోణంలో గమనిస్తున్నారనే విషయాన్ని గుర్తుపట్టలేకపోయానంటున్నాడు గోపీచంద్ మలినేని. అదే టైమ్ లో చిరంజీవి గారు పిలిచి మనసులో ఉన్న భావాలు ఎక్స్ ప్రెస్ చేయమని తనకు సలహా ఇచ్చారట. అది తన జీవితాన్ని మార్చేసిందని చెబుతున్నాడు గోపీచంద్.

క్రాక్ సినిమా దాదాపు పూర్తయిందని, త్వరలోనే ఫస్ట్ కాపీ రెడీ అవుతుందంటున్నాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాలో కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్నీ ఉంటాయంటున్నాడు. అయితే రవితేజ-బ్రహ్మానందం కాంబినేషన్ లో కామెడీ మాత్రం ఉండదంటున్నాడు.