షూటింగ్ లో గాయపడ్డ గోపీచంద్

Monday,February 18,2019 - 03:03 by Z_CLU

యాక్షన్ హీరో గోపీచంద్ షూటింగ్ లో గాయపడ్డాడు. తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న గోపీచంద్, ఓ యాక్షన్ సీన్ షూట్ సందర్భంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

తిరు దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ చేస్తున్నాడు గోపీచంద్. జైపూర్ శివార్లలో ఈ సినిమాకు సంబంధించి ఓ బైక్ ఛేజింగ్ సీన్ తీస్తున్నారు. షూట్ లో భాగంగా బైక్ నడుపుతూ కిందపడ్డాడు గోపీచంద్. వెంటనే అతడ్ని దగ్గర్లోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

గోపీచంద్ కు తగిలినవి చిన్నచిన్న దెబ్బలే అంటోంది యూనిట్. అయినప్పటికీ అతడికి పూర్తి విశ్రాంతి ఇచ్చి, కోలుకున్న తర్వాతే తిరిగి షూటింగ్ చేస్తామని ప్రకటించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.