Pawan Remake - తెరపైకి మరో హీరో

Thursday,November 19,2020 - 11:02 by Z_CLU

Power Star Pawan Kalyan హీరోగా సితార ఎంటర్టైన్ మెంట్స్ ఎప్పుడైతే సినిమా ఎనౌన్స్ చేసారో అప్పటి నుండి ఈ రీమేక్ పై రోజుకో ప్రచారం జరుగుతుంది. మళయాళంలో బ్లాక్ బస్టర్ సాధించిన Ayyappanum koshiyum సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ తో పాటు మరో హీరో కూడా ఉంటాడు. అయితే ఆ హీరో ఎవరనేది ఇంకా మేకర్స్ నుండి ఎనౌన్స్ మెంట్ రాలేదు.

దీంతో రోజుకో హీరో పేరు చక్కర్లు కొడుతుంది. మొన్నటివరకూ Daggubati Rana, Sudeep లాంటి హీరోల పేర్లు వినిపించగా తాజాగా ఈ రీమేక్ లో పవన్ తో Gopichand నటిస్తాడనే టాక్ ఊపందుకుంది.. మరి నిజంగానే గోపీచంద్ ఈ సినిమాకు ఓకె చెప్పాడా లేదా ఇది రూమరా అనేది తెలియాల్సి ఉంది.

Gopichand-seetimaar

ఏదేమైనా నిర్మాతలు ఈ సినిమాలో ఉండే మరో ఇంపార్టెంట్ రోల్ చేసే హీరో పేరు ప్రకటించే వరకూ ఇలా హీరోలందరి పేర్లు వినిపిస్తుంటాయి. Sagar K Chadra డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే నెల నుండి సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.

Also Check – పవన్ కొత్త సినిమా హీరోయిన్ ఫిక్స్ అయిందా?