స్పీడందుకున్న గోపీచంద్

Thursday,September 26,2019 - 10:02 by Z_CLU

ఆ మధ్య వరస ఫ్లాపులతో కాస్త వెనకబడ్డాడనిపించినా ఓ చిన్న గ్యాప్ లో మళ్ళీ స్పీడందుకున్నాడు గోపీచంద్. ప్రస్తుతం చాణక్య రిలీజ్ కి రెడీగా ఉంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో గోపీచంద్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కి ప్యాకప్ చెప్పీ, ప్రమోషన్స్ స్టార్ట్ చేసే గ్యాప్ లోనే బిసు సుబ్రహ్మణ్యం డైరెక్షన్ లో అప్పుడే కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చేశాడు.

ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో బిజీగా ఉంటూనే అప్పుడే ఈ సినిమా తరవాత చేయాల్సిన సినిమాపై కూడా ఫోకస్ బిగిన్ చేసేశాడు. బిసు సుబ్రహ్మణ్యం తరవాత ఇమ్మీడియట్ గా గోపీచంద్ సెట్స్ పైకి రాబోయేది సంపత్ నందితోనే.. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని తెలుస్తుంది.

మరి ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా ఫినిషయ్యాక సంపత్ నందితో సెట్స్ పైకి వస్తాడా..? లేకపోతే సైమల్టేనియస్ గా రెండేసి సినిమాలు చేస్తాడా..? అనేది తెలియదు కానీ, జస్ట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉండగానే ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

వరస చూస్తుంటే సినిమా సక్సెస్, ఫ్లాప్స్ రేషియో కన్నా స్పీడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు గోపీచంద్. ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్న ‘చాణక్య’ చుట్టూ కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమా గనక ఎక్స్ పెక్ట్ చేసిన సక్సెస్ అందుకుంటే, గోపీచంద్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్టే.