కెరీర్ లో ఫస్ట్ టైం ....

Tuesday,May 02,2017 - 03:52 by Z_CLU

యాక్షన్ హీరో గోపీచంద్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న గౌతమ్ నంద సినిమాలో ఈ యాక్షన్ హీరో.. రెండు డిఫరెంట్ రోల్స్ లో ఎట్రాక్ట్ చేయబోతున్నాడు. ఒక పాత్రలో కంప్లీట్ రిచ్ మేన్ లా, మరో పాత్రలో సాదాసీదా మాస్ కుర్రాడిలా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమాకు ఇదే మెయిన్ హైలెట్.

టైటిల్ కు తగ్గట్టు గౌతమ్ నంద సినిమాలో గౌతమ్ పాత్ర రిచ్ గా కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ కు సంబంధించి ఇప్పటికే హెలికాప్టర్ పక్కన గోపీచంద్ నిల్చున్న స్టిల్స్ రిలీజ్ చేశారు. మరో పాత్ర పేరు నంద. ఈ పాత్రకు సంబంధించి స్లమ్ ఏరియాలో లుంగీ కట్టుకొని గోపీచంద్ కనిపించే స్టిల్స్ వచ్చాయి. ఈ నంద క్యారెక్టర్ కే హీరోయిన్ గా హన్సిక నటిస్తోంది. స్టయిలిష్ గౌతమ్ క్యారెక్టర్ సరసన క్యాథరీన్ హీరోయిన్ గా కనిపించనుంది. థమన్ ఈ సినిమాకు  సంగీతం అందిస్తున్నాడు…

ఇటీవలే దుబాయ్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్ ప్రెజెంట్ మరో షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నారు.. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం… జూన్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్