కొత్త కహాని...

Friday,October 14,2016 - 04:42 by Z_CLU

ఎప్పుడో ఫిబ్రవరిలో అనౌన్స్ అయింది గోపీచంద్, నయనతార జంటగా నటించే సినిమా. గతంలో సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు,లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన బి. గోపాల్ ఈ సినిమాకి డైరెక్టర్. అయితే ముహూర్తం డేట్ తప్ప రిలీజ్ డేట్ ఫిక్స్ కాని ఈ సినిమాకు థియేటర్ కి రాక ముందే సినిమా కష్టాలు, అవే ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. దాంతో సినిమా థియేటర్ వరకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ల్యాబ్ లోనే ఉండిపోయింది.

muhurat-gopichand-bgopalfilm

    జయ బాలాజీ రియల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాని తాండ్ర రమేష్ నిర్మించారు. గోపి చంద్, నయనతార మొట్ట మొదటిసారిగా జోడి కట్టిన ఈ సినిమాకి ఎట్టకేలకు మోక్షం లభించినట్టుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను ఎలాగైనా రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తుంది.

nayanthara-and-gopichand-480x480

    ఇంద్ర లాంటి మాస్ బ్లాక్ బస్టర్ తరవాత యాక్షన్ చెప్పడానికి బి. గోపాల్ చాలా సమయమే తీసుకున్నాడు. ఎలాగైతేనేం అన్ని కష్టాలు దాటుకుని త్వరలో థియేటర్ లో సందడి చేయనున్న ఈ సినిమా రిలీజ్ డేట్, రేపో మాపో అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.