సమ్మర్ కి గోపీచంద్ సినిమా

Tuesday,January 17,2017 - 05:00 by Z_CLU

గోపీచంద్ సమ్మర్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ సక్సెస్ ఫుల్ గా మూడు షెడ్యూల్స్ కి ప్యాకప్ చెప్పేసింది. ఇక మిగిలిన నాలుగో షెడ్యూల్ కూడా ఇవాళ్టి నుండి బిగిన్ అయిపోయింది. ఈ షెడ్యూల్ ని పక్కా ప్లానింగ్ ప్రకారం ఫిబ్రవరి 20 కల్లా కంప్లీట్ చేసుకోవాలని స్కెచ్ వేసుకుంది సినిమా యూనిట్.

 ఇప్పటికే థాయ్ ల్యాండ్ తో పాటు హైదరాబాద్ లోని ఎగ్జోటిక్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా యూనిట్, ఇప్పుడు రామ్ లక్ష్మణ్ సారథ్యంలో అల్టిమేట్ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించే పనిలో ఉంది.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో హన్సిక మోత్వాని, కేథరిన్ థెరిసా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంకా పర్టికులర్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు కానీ, ఫస్ట్ లుక్ తో పాటే టైటిల్ కూడా అనౌన్స్ చేయాలనే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.