గోపీచంద్ బర్త్ డే స్పెషల్

Tuesday,June 12,2018 - 12:24 by Z_CLU

యాక్షన్ ఎలిమెంట్స్ అయినా ఇమోషనల్ సీక్వెన్సెస్ అయినా ఈజీగా పర్ఫామ్ చేసేస్తాడు. తొలివలపు సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయి, కరియర్ మధ్యలో విలన్ గా కూడా నటించాడు. క్యారెక్టర్ ఎలాంటిదైనా ఆడియెన్స్ ని కన్విన్స్ చేయడమే పాలసీగా పెట్టుకున్న హీరో గోపీచంద్, ఈ రోజు తన 39 వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా జీ సినిమాలు స్పెషల్ స్టోరీ.

యాక్టర్ ఇంపాక్ట్ : ‘తొలి వలపు’ సినిమాలో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన గోపీచంద్, ఆ తర్వాత వరసగా జయం, నిజం, వర్షం సినిమాల్లో విలన్ గా నటించి అవుట్ స్టాండింగ్ యాక్టర్ గా పర్మనెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నాడు.

సెపరేట్ రూట్ : ‘యజ్ఞం’ సినిమాతో మళ్ళీ హీరోగా సినిమాలు చేయడం బిగిన్ చేసిన గోపీచంద్ సినిమా సెలెక్షన్ ని గమనిస్తే ప్రతీది దానికదే స్పెషల్. యజ్ఞం, ఆంధ్రుడు, ఒంటరి, ఒక్కడున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే, గోపీచంద్ స్టోరీ బేస్డ్ సినిమాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు అర్థమవుతుంది.

కమర్షియల్ హీరో : పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘గోలీమార్’ సినిమాతో సక్సెస్ ఫుల్ కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు గోపీచంద్. ఆ తరవాత వరసగా వచ్చిన మొగుడు, సాహసం, లౌక్యం, సౌఖ్యం సినిమాలు గోపీచంద్ ని ఆడియెన్స్ కి మరింత దగ్గర చేశాయి.

రీసెంట్ మూవీస్ : 2017 లో సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిన ‘గౌతమ్ నంద’ సినిమాలో డ్యూయల్  రోల్ లో నటించిన గోపీచంద్, అదే సంవత్సరం రిలీజైన ‘ఆక్సిజన్’ తో మరింత మెస్మరైజ్ చేశాడు.

వెరీ వెరీ స్పెషల్ : ప్రస్తుతం ‘పంతం’ సినిమాతో బిజీగా ఉన్నాడు గోపీచంద్. చక్రవర్తి రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గోపీచంద్ కి 25 వ సినిమా కావడంతో న్యాచురల్ గానే ఈ సినిమా చుట్టూ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి.

డిఫెరెంట్ సినిమాలతో కరియర్ ప్లాన్ చేసుకుంటున్న గోపీచంద్, మరెన్నో సక్సెస్  ఫుల్ సినిమాలు చేయాలని, ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది జీ సినిమాలు.