చాణక్యగా మారిన గోపీచంద్

Monday,June 10,2019 - 12:01 by Z_CLU

హీరో గోపీచంద్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. తిరు దర్శకత్వంలో ఈ హీరో నటిస్తున్న సినిమాకు చాణక్య అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

సినిమాకు సంబంధించి 50శాతం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ నడుస్తోంది. ఈ షెడ్యూల్ తర్వాత రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

సాంకేతిక నిపుణులు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: తిరు
బ్యాన‌ర్‌: ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గ‌రిక‌పాటి
మ్యూజిక్‌: విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: వెట్రీ ప‌ళ‌ని స్వామి
మాట‌లు: అబ్బూరి ర‌వి
ఆర్ట్‌: ర‌మ‌ణ వంకా