#Gopichand30 - హ్యాట్రిక్ కాంబినేషన్

Wednesday,July 14,2021 - 01:56 by Z_CLU

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్న గోపీచంద్ నెక్స్ట్ శ్రీవాస్ డైరెక్షన్ లో తన 30వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ కాంబో సినిమాను ప్రకటించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘లక్ష్యం’ , ‘లౌక్యం’ సినిమాలు వచ్చాయి. రెండూ బాగానే ఆడి సూపర్ హిట్ సాధించాయి. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ కాంబోలో మూడో సినిమా రాబోతుంది.

Director-sriwass

ఈ సినిమా కలకత్తా నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇటివలే గోపీచంద్ కి ఫుల్ నెరేషన్ ఇచ్చిన శ్రీవాస్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాడు. హీరోయిన్ తో పాటు మిగతా నటీ నటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాకు భూపతి రాజా కథను అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ పై TG విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉన్న పక్కా కమర్షియల్ సినిమా పూర్తయిన వెంటనే గోపీచంద్, శ్రీవాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

లక్ష్యం, లౌక్యం సినిమాల్లో గోపీచంద్ ని ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ లో చూపిస్తూ యాక్షన్ ఎపిసోడ్స్ తో మెప్పించిన శ్రీవాస్ మరోసారి అలాంటి కథతోనే #Gopichand30 సినిమా తెరకెక్కించనున్నాడట. కాకపోతే ఈసారి కలకత్తా బ్యాక్ డ్రాప్ లో కథను నడిపించి సరికొత్తగా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కానుందని సమాచారం. ఈ లోగ పక్కా కమర్షియల్ సినిమాను సంబంధించి బ్యాలెన్స్ షూట్ ఫినిష్ చేస్తాడు గోపీచంద్.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics