సెట్స్ పైకి వచ్చేసిన గోపీచంద్ 25 వ సినిమా

Wednesday,December 20,2017 - 03:14 by Z_CLU

గోపీచంద్ 25 వ సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. ఆక్సిజన్ తరవాత మరో ఎంటర్ టైనర్ తో రెడీ అవుతున్న గోపీచంద్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. అటు యాక్షన్, ఇటు ఫ్యామిలీ ఇమోషన్స్ ని బ్యాలన్స్ చేస్తూ ఉండేలా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్న గోపీచంద్ ఈ సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

గోపీచంద్ సరసన మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో రవితేజ ‘బెంగాల్ టైగర్’ సినిమాని నిర్మించిన K.K. రాధామోహన్ ఈ సినిమాకి నిర్మాత. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.