రెండు సినిమాలను రెడీ చేస్తున్న గోపి చంద్

Sunday,April 23,2017 - 12:02 by Z_CLU

ప్రెజెంట్ సంపత్ నంది డైరెక్షన్ లో ‘గౌతమ్ నంద’ సినిమాలో నటిస్తున్న గోపి చంద్ ఈ ఇయర్ మరో సినిమాతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ‘గౌతమ్ నంద’ తో పాటు ‘ఆరడుగుల బుల్లెట్టు’ అనే మరో సినిమాను కూడా రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు గోపి చంద్….

జయా బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన నయనతార కథానాయికగా నటిస్తుంది.. రీసెంట్ గా ఈ సినిమాకు ‘ఆరడగుల బుల్లెట్టు’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసిన మేకర్స్ మే ఎండింగ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.