రేపే 'ఆరడుగుల బుల్లెట్' రిలీజ్

Thursday,June 08,2017 - 02:45 by Z_CLU

మరోసారి తన బ్రాండ్ మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రెడీ అయిపోయాడు హీరో గోపీచంద్. ఆరడుగుల బుల్లెట్ గా సిల్వర్ స్క్రీన్ పైకి దూసుకొస్తున్నాడు. గోపీచంద్-బి.గోపాల్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ, వీకెండ్ ఎట్రాక్షన్ గా  రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఆరడుగుల బుల్లెట్ సినిమాలో ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి. గోపీచంద్ యాక్షన్ మెయిన్ ఎట్రాక్షన్ అయితే నయనతార అందాలు ఈ సినిమాకు మరో ఎట్రాక్షన్. వెంకటేష్ తో చేసిన బాబు బంగారం సినిమా తర్వాత నయన్ నటిస్తున్న స్ట్రయిట్ తెలుగు మూవీ ఇదే. గోపీచంద్-నయన్ ఫ్రెష్ కాంబినేషన్ అదిరిపోయిందనే విషయం తాజాగా విడుదలైన సాంగ్ ప్రోమోస్ చూస్తే తెలుస్తోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. బి.గోపాల్ డైరక్షన్ మరో అదనపు ఆకర్షణ.

ఆరడుగుల బుల్లెట్ సినిమాకు సంబంధించి ఇప్పటికే థియేట్రికల్ ట్రయిలర్ విడుదలైంది. తాజాగా యాక్షన్ ఎలిమెంట్స్ తో మరో ట్రయిలర్ లాంచ్ చేశారు. ఈ రెండూ సోషల్ మీడియాలో బాగా క్లిక్ అయ్యాయి. సమ్మర్ ఎట్రాక్షన్ గా రేపు థియేటర్లలోకి రాబోతోంది ఆరడుగుల బుల్లెట్.