మొద‌లైన గూఢ‌చారి-2 స్క్రిప్ట్ వ‌ర్క్

Monday,December 17,2018 - 11:50 by Z_CLU

ఈ ఏడాది విడుద‌లైన సినిమాల్లో అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచిన చిత్రం గూఢ‌చారి. అడ‌వి శేష్ హీరోగా న‌టించిన ఈ స్పై థ్రిల్ల‌ర్ సంచ‌ల‌నం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఇప్పుడు సిద్ధ‌మ‌వుతుంది. అడ‌వి శేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సీక్వెల్ గురించి అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసారు.

ఇప్ప‌టికే ఈ చిత్ర స్క్రిప్ట్ వ‌ర్క్ మొద‌లైంది. 2019 మ‌ధ్య‌లో గూఢ‌చారి 2 షూటింగ్ మొద‌లు కానుంది. భారీ బ‌డ్జెట్.. అద్భుత‌మైన లొకేష‌న్స్.. భారీ స్థాయిలో రాబోతోంది గూఢచారి సీక్వెల్. తొలి భాగం కంటే మంచి ఔట్ పుట్ తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

గూఢ‌చారి సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ లో అసిస్టెంట్ గా ఉన్న రాహుల్ పాకాల గూఢచారి 2కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 2020లో ఈ సీక్వెల్ విడుద‌ల కానుంది.