సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Thursday,May 11,2017 - 11:18 by Z_CLU

అభిమాన హీరోను కలవాలని అందరికీ ఉంటుంది. అతడితో ఒక్క సెల్ఫీ దిగితే జన్మ ధన్యం అనుకునే జనాలు చాలామంది. అలాంటిది ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో మీటింగ్ అంటే ఎలా ఉంటుంది. ఊహించుకోవడానికే థ్రిల్లింగ్ గాా ఉన్న ఈ ఊహ త్వరలోనే నిజం కానుంది. అభిమానులతో రజనీకాంత్ భేటీకి డేట్ ఫిక్స్ అయింది.

దాదాపు 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు రజనీకాంత్. మే 15 నుంచి 19 వరకు 4 రోజుల పాటు అభిమానులను కలిసేందుకు సమయం కేటాయించారు. నిజానికి గత నెలలోనే అభిమానులను కలవాలనుకున్నారు రజనీకాంత్. కానీ అందరితో సెల్ఫీలు దిగడం సాధ్యంకాదు కాబట్టి వాయిదావేశారు.

ఈసారి మీటింగ్ కు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన కొంతమందిని మాత్రమే ఆహ్వానించారు. వాళ్లలో కూడా అతితక్కువ మందితో రజనీకాంత్ ఫొటో దిగుతారు. సూపర్ స్టార్ తో ఫొటో దిగనున్న ఆ అదృష్టవంతుల జాబితా రేపు రిలీజ్ కానుంది.