ఇకపై ఏడాదికి రెండు

Monday,March 27,2017 - 12:01 by Z_CLU

బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. టెక్నీషియన్స్ అందర్నీ రాజమౌళి ఇంట్రడ్యూస్ చేసిన విధానం అందరికీ నచ్చింది. మరీ ముఖ్యంగా ప్రొడక్షన్ బాయ్స్ ను కూడా రాజమౌళి ప్రస్తావించడం అందర్నీ కదిలించింది. ఇదే వేదికపై ప్రభాస్ ను చూసి యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. దానికి తోడు ప్రభాస్ చేసిన ఓ ప్రకటన ఫ్యాన్స్ లో ఆనందాన్ని డబుల్ చేసింది.

దాదాపు మూడున్నరేళ్ల పాటు బాహుబలి ఫ్రాంచైజీ మీదే ఉన్నాడు ప్రభాస్. అంటే.. ఈ 4 ఏళ్లలో కేవలం 2 సినిమాలు మాత్రమే చేశాడన్నమాట. మరీ ముఖ్యంగా మాస్ మసాలా సినిమాలకు దూరమయ్యాడు. అందుకే ఇకపై ఏడాదికి కనీసం 2 సినిమాలు చేస్తానని ప్రకటించాడు యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్ ఎనౌన్స్ మెంట్ తో వేదిక వద్ద ఒకటే ఈలలు, చప్పట్లు.

బాహుబలి-2 సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. వచ్చేనెల 28న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానున్న తెలుగు సినిమాగా బాహుబలి-2 చరిత్ర సృష్టించబోతోంది.