యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Tuesday,December 06,2016 - 06:40 by Z_CLU

ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. యంగ్ టైగర్ ఎప్పుడెప్పుడు కొత్త సినిమా ఎనౌన్స్ చేస్తాడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు తీపికబురు ఇది. అవును… యంగ్ టైగర్ కొత్త సినిమా లాక్ చేశాాడు. అంతా ఊహించినట్టు, రూమర్లను నిజం చేస్తూ… డైరక్టర్ బాబి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది కాస్త పాత వార్తే అనుకున్న జనాలకు లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఈనెల 9న ఈ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. వచ్చేనెలలోనే ఈ సినిమా ఓపెనింగ్ కూాాడా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ntr-bobby-new-film

జనతా గ్యారేజ్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు ఎన్టీఆర్. గడిచిన ఆరేళ్లలో యంగ్ టైగర్ ఎప్పుడూ ఇంత గ్యాప్ తీసుకోలేదు. ఓ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమాను ఎనౌన్స్ చేసేవాడు. కానీ జనతా గ్యారేజ్ తర్వాత మాత్రం ఎన్టీఆర్ డైైలమాాలో పడిపోయాడు. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తర్వాత, ఎలాంటి కథను ఎంచుకోవాలనే టెన్షన్ ఎన్టీఆర్ ను వెంటాడింది. అలా ఎన్నో కథలు విన్న తర్వాత.. ఫైనల్ గా బాబి చెప్పిన స్టోరీలైన్ ను లాక్ చేశాడు ఎన్టీఆర్. పైగా ఈ స్టోరీని, స్క్రీన్ ప్లేతో పాటు బాబి వినిపించడంతో యంగ్ టైగర్ ఇంప్రెస్ అయ్యాడు.