'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ రిలీజ్

Friday,September 22,2017 - 04:02 by Z_CLU

గుడ్ అంటే మంచి, బ్యాడ్ అంటే చెడు, అగ్లీ అంటే తింగ‌రిత‌నం అనే ప‌దాలు మ‌న‌కు తెలిసిందే. వీటిని సంద‌ర్భానుసారం బ‌య‌ప‌డుతుంటాయి. మ‌నం వాటిని అలాగే త‌గిన సంద‌ర్భంలో ఉప‌యోగిస్తుంటాం. ఇప్పుడు వీటినే టైటిల్‌గా పెట్టి  ర‌చ‌యిత హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెరకెక్కిస్తోన్న చిత్రం `గుడ్ బ్యాడ్ అగ్లీ`. ఈ సినిమాకు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ సంగీత సారథ్యం వ‌హించ‌డం కూడా విశేషం. అంజిరెడ్డి ప్రొడ‌క్ష‌న్‌, ఎస్‌.కె.విశ్వేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అంజి రెడ్డి నిర్మాత‌.  ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ సంద‌ర్భంగా.. సంగీత ద‌ర్శ‌కుడు, ద‌ర్శ‌కుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మాట్లాడుతూ – “గుడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రం ద‌ర్శ‌కుడిగా నా తొలి చిత్రం. మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. సినిమా 1988-89 కాలంలో ఓ మారుమూల గ్రామంలో జ‌రిగిన ప్రేమ‌కథే ఈ చిత్రం. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో పాటు ప‌క్కాక‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. పెద్ద హీరోల స్థాయికి త‌గ్గ‌కుండా సినిమా ఉంటుంది.

రైట‌ర్ నుండి దర్శ‌కుడిగా మారిన నేను పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్లు న‌టీన‌టుల‌ను ఎంపిక చేసుకున్నాను. సినిమాలో ఏకైక లేడీ క్యారెక్ట‌ర్‌ను శ్రీముఖి చేసింది. అడగ్గానే ఒప్పుకుని చేసింది. అలాగే కిషోర్ గారు ఎంతో గొప్ప‌గా న‌టించారు. సినిమాలో హీరో పాత్ర‌లో న‌టించిన ముర‌ళి కొత్త డైమ‌న్ష‌న్ ఉన్న పాత్ర చేశారు.  ఫ‌స్ట్‌లుక్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు టీజ‌ర్‌ను విడుద‌ల చేశాం. టీజ‌ర్ చాలా బావుంద‌ని అంటున్నారు. ఒక చిన్న సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావ‌డం మా యూనిట్‌కు ఎన‌ర్జీనిచ్చింది. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం” అన్నారు.