#LoveStory - అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్!

Sunday,September 19,2021 - 06:24 by Z_CLU

నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరి’ ఎట్టకేలకు థియేటర్స్ లోకి వస్తుంది. సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈ నెల 24 న థియేటర్స్ లోకి రాబోతుంది. సెకండ్ వేవ్ తర్వాత అంతో ఇంతో బజ్ ఉన్న సినిమా అంటే ఇదే. అందుకే ఎగ్జిబ్యూటర్స్ వారం ముందే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసి ఆన్లైన్ లో టికెట్స్ అమ్ముతున్నారు.

‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న సినిమా కావడం, పైగా సాయిపల్లవి-చైతు కాంబోలో మొదటి సినిమా అవ్వడంతో ఈ సినిమా జనాలని థియేటర్స్ కి రప్పించి భారీ వసూళ్ళు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పైగా సినిమాలో సారంగా దరియా సాంగ్ రికార్డు స్థాయి వ్యూస్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది కూడా. అది సినిమాకు అడ్వాంటేజ్ అయింది.

ప్రస్తుతం నైజాంతో పాటు అన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసి టికెట్లు విక్రయిస్తున్నారు. చాలా వరకు రిలీజ్ డే మూడు కొన్ని చోట్ల నాలుగు షోస్ ఫుల్ అయ్యాయి. ఇక సిటీలో కొన్ని థియేటర్స్ లో మార్నింగ్ , మ్యాట్నీ లకు టికెట్లు దొరకని పరిస్థితి. సెకండ్ వేవ్ తర్వాత ఇంతవరకు అడ్వాన్స్ బుకింగ్ అనేది లేదు. లవ్ స్టోరి నుండే మళ్ళీ ఆ వేడుక మొదలైంది. ప్రస్తుతం బుక్ మై షో లో సొల్ద్ అవుట్ అంటూ కనిపిస్తున్న టికెట్స్ చూస్తుంటే థియేటర్స్ పై ఆధార పడిన అందరూ సంతోష పడుతున్నారు. మరి రిలీజ్ రోజు టాక్ బాగుంటే కనుక సినిమా మంచి కలెక్షన్స్ కొల్లగొట్టి మళ్ళీ థియేటర్స్ కి పూర్వ వైభవం తీసుకురావడం ఖాయం.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics