గోల్డెన్ బ్యూటీస్

Sunday,December 04,2016 - 11:19 by Z_CLU

ఇతర భాషల నుండి టాలీవుడ్ లో అడుగుపెట్టి బడా సినిమాలతో టాప్ హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ ఎందరో. అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో ఇద్దరూ చేరిపోవడానికి తహతహలాడుతున్నారు. వారిద్దరూ మరెవరో కాదు. ఒకరు తమిళ బ్యూటీ కీర్తి సురేష్ కాగా, మరొకరు మలయాళ కుట్టి అను ఇమ్మానుయేల్. వీరిద్దరూ ప్రస్తుతం తెలుగులో ఒకేఒక్క సినిమా చేసి మరో సినిమాలో నటిస్తుండగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ అఫర్ అందుకున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ నటించనున్న  సినిమాకు హీరోయిన్స్ గా ఎంపికయ్యారు. దీంతో ఈ ముద్దుగుమ్మల ఆనందానికి అవధుల్లేవ్. ఇటీవలే తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

collage2
ఈ బంపర్ అఫర్ తో ఉన్నట్టుండి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ ఇద్దరూ పవన్ తో ఎప్పుడెప్పుడు నటిస్తామా? ఆ సినిమా సెట్ లో ఎప్పుడు అడుగుపెడతామా?  అని ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ఈ ఆఫర్ తో మలయాళ, తమిళ్ కుట్టిలు టాప్ హీరోయిన్ రేస్ అడుగుపెట్టేసినట్టే…