God Father మెస్మరైజ్ చేయనున్న చిరు , సల్మాన్ కాంబో !

Saturday,March 26,2022 - 11:30 by Z_CLU

Chiru, SalmanKhan Combo it’s a treat for movie lovers

సహజంగా ఒక పెద్ద సినిమాలో ఇద్దరు బడా స్టార్లు స్క్రీన్ పై కనిపిస్తే మూవీ లవర్స్ అందానికి అవధులుండవు. త్వరలో ‘God Father’ చూసి అలాంటి ఎక్స్ పీరియన్స్ చేయబోతున్నారు ఆడియన్స్. అవును చిరుతో కలిసి సినిమా ఎండింగ్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ లో కనిపించనున్నాడు సల్మాన్ ఖాన్. తాజాగా సల్మాన్ ఖాన్ పోర్షన్ ను ముంబైలో ఫినిష్ చేశారు. వారం రోజుల పాటు జరిగిన ఈ యాక్షన్ ఎపిసోడ్ లో చిరుతో కలిసి నటించాడు సల్లు భాయ్.

నిజానికి సల్మాన్ ఖాన్ ఎంట్రీతో  ‘గాడ్ ఫాదర్’ పై నార్త్ ఆడియన్స్ ఫోకస్ పడింది. సల్మాన్ ఖాన్ రోల్ సినిమాకు ప్లస్ అవ్వడంతో పాటు నార్త్ లో ఇంకాస్త కలెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్లైమాక్స్ లో చిరు పెర్సనల్ మనిషిగా ఎంట్రీ ఇస్తాడు సల్మాన్ ఖాన్. ఒరిజినల్ లో పృథ్వీ రాజ్ ఈ క్యారెక్టర్ ప్లే చేశాడు.

 టాలీవుడ్ మెగాస్టార్ , బాలీవుడ్ సూపర్ స్టార్ ఇద్దరూ స్క్రీన్ పై అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ లో కనిపించి ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం కొన్ని రోజుల షూటింగ్ మినహా దాదాపు షూట్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుంది.త్వరలోనే రిలీజ్ ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics