ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ కన్నుమూత

Monday,June 10,2019 - 11:38 by Z_CLU

రచయిత, నటుడు గిరీష్ కర్నాడ్ (81) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీష్, ఈరోజు ఉదయం బెంగళూరులోని లావేలీ రోడ్ లో ఉన్న తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తన రచనల ద్వారా పద్మశ్రీ,, పద్మభూషణ్, జ్ఞానపీఠ్ తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులు పొందారు గిరీష్.

కేవలం రచయితగానే కాకుండా, విలక్షణ నటుడిగా కూడా తనదైన ముద్రవేశారు. వివిధ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో గిరీష్ నటించారు. ధర్మచక్రం, శంకర్ దాదా ఎంబీబీఎస్, రక్షకుడు లాంటి ఎన్నో చిత్రాలు తెలుగులో గిరీష్ కు మంచి పేరుతెచ్చిపెట్టాయి.

దర్శకుడిగా కూడా గిరీష్ కు మంచి పేరుంది. వంశవృక్ష అనే కన్నడ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు గిరీష్ కర్నాడ్.