ఘంటశాల జయంతి స్పెషల్ స్టోరీ...

Monday,December 04,2017 - 02:03 by Z_CLU

తెలుగు సినిమా సంగీత సామ్రాజ్యంలో సుస్థిర స్థానం ఘంటసాల గారిది. 1922 డిసెంబర్ 4 న కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చౌటుపల్లి లో జన్మించిన ఈయన తెలుగు సినిమాకి దక్కిన విలువైన వరం. ఆయన తండ్రి సూరయ్య పసితనంలోనే చనిపోవడంతో మేనమామ రామయ్య దగ్గర పెరిగారు ఘంటసాల. స్వతహాగా సంగీతాభిమాని అయిన రామయ్య గారి వల్లే ఘంటసాల గారికి సంగీతం పట్ల ఆసక్తి పెరిగింది. అలా చిన్నప్పటి నుండే పద్యాలన్నా, నాటకాలన్నా ఇష్టపడే ఘంటసాల 1941 లో విద్వాన్ పట్టా పొందారు.

1945 లో B.N. రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ‘స్వర్గసీమ’ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన ఘంటశాల సినిమా పద్యాల్లో సరికొత్త ప్రయోగం చేశారు. ఘంటశాల సినిమా ఇండస్ట్రీకి రావడానికి ముందు 2 నిమిషాల పద్యానికి 6 నిమిషాల రాగాన్ని కలిపి పాడేవారు. ఈ పద్ధతిని మార్చి పద్యంలో రాగాన్ని కుదించి, వచనాన్ని చేర్చి సరికొత్త ప్రయోగం చేశారు. బిగినింగ్ లో ఈ మార్పుకు విమర్శలు ఎదుర్కున్నా, చివరికి ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయి సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసింది. ఆ తరవాత వచ్చిన పౌరాణిక సినిమాలకు కూడా ఇదే పద్ధతి మార్గదర్శి అయింది.

1958 లో రిలీజైన ‘భూకైలాస్’ సినిమాలో కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రం గొప్పదనాన్ని వివరిస్తూ తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలకు స్వరాన్నదించారు ఘంటశాల. 1973 లో భక్త తుకారాం సినిమాకి అక్కినేనికి ఎంత పేరు వచ్చిందో, ఘంటశాలకి కూడా అదే రేంజ్ ఖ్యాతిని తెచ్చిపెట్టింది.

ట్యూన్ ఇచ్చి మ్యూజిక్ కంపోజ్ చేయడం ఇష్టం లేని ఘంటశాల సన్నివేశానికి తగ్గట్టు సాహిత్యం వచ్చిన తరవాతే, తన శైలిలో ఆ సాహిత్యానికి ట్యూన్స్ కట్టేవారు. అలా ట్యూన్ అయిన ఎన్నో వందల సాంగ్స్ ప్రతి తెలుగింట్లో మార్మోగాయి. వెండితెరపై రెండు దశాబ్దాల పాటు తన సంగీత సామ్రాజ్యాన్ని విస్తరించిన ఘంటశాల ఇప్పటి జెనెరేషన్ కి కూడా ఫేవరేట్ మ్యూజిక్ కంపోజరే.

శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఏడు కొండలు ఎక్కాలన్నది ఎంత వాస్తవమో, ఆయన గానామృతాన్ని ఆస్వాదించాలంటే ఆయన సృష్టించిన స్వరాల అలల్లో తేలియాడాల్సిందే. ప్రతి ఇంట్లో గుడికట్టుకున్న మన మధ్య భౌతికంగా లేకపోయినా, తన పాటలతో ప్రతి జెనెరేషన్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. అందుకే ఈ స్వర మాంత్రికుడి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటుంది జీ సినిమాలు.