Varun Tej Ghani - దూసుకొస్తున్నాడు
Thursday,January 28,2021 - 01:46 by Z_CLU
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్న సినిమా గని. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీని జూలై 30న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్, ఈ సినిమాతో టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అవుతోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వరుణ్‌తేజ్ ఇప్పటివరకు టచ్ చేయని డిఫరెంట్ జానర్, పవర్ ఫుల్ క్యారెక్టర్ గని. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తాడు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నటీనటులు:
వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు
సాంకేతిక వర్గం:
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి.విలియమ్స్
మ్యూజిక్: తమన్.ఎస్
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్
నిర్మాతలు: సిద్ధు ముద్ద, అల్లు బాబీ
దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి