మరో లవ్ స్టోరీ తో రెడీ అవుతున్నారు ...

Monday,May 08,2017 - 01:00 by Z_CLU

ఓ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ సినిమా సూపర్ హిట్ అయితే చాలు.. మరోసారి ఆ మల్టీ స్టారర్ కాంబో ను రిపీట్ చేయాడానికి రెడీ అవుతుంటారు దర్శకనిర్మాతలు.. అయితే ప్రెజెంట్ అలాంటి ఓ సూపర్ హిట్ కాంబినేషన్ టాలీవుడ్ ఆడియన్స్ ను మరో సారి ఎంటర్టైన్ చేయడానికి రాబోతుంది.

ఇక మరో సినిమాతో రాబోతున్న ఆ హీరోలు మరెవరో కాదు నారా రోహిత్-నాగ సూర్య. లాస్ట్ ఇయర్ వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీ స్టారర్ సినిమా ‘జ్యో అచ్యుతానంద’ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. అయితే మరో సారి వీరిద్దరి కాంబో లో ‘కథలో రాజకుమారి’ అనే సినిమా తెరకెక్కుతుంది.. నారా రోహిత్-నాగ సౌర్య హీరోలుగా నమితా ప్రమోద్, నందిత రాజ్ హీరోయిన్స్ గా మహేష్ సూరపనేని దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రెజెంట్ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఎట్రాక్ట్ చేస్తుంది.. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.. త్వరలోనే రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్…