గెట్ రెడీ : ఫస్ట్ లుక్ తో వస్తున్న రెబెల్ స్టార్ !

Tuesday,March 17,2020 - 12:16 by Z_CLU

రాధా కృష్ణ డైరెక్షన్ లో తన 20వ చేస్తున్న రెబెల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ ని ఖుషీ చేయడానికి రెడీ అవుతున్నాడు. అవును ఉగాది స్పెషల్ గా ప్రభాస్ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. త్వరలోనే అధికారికంగా డేట్ తో పాటు టైం కూడా చెప్పనున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ‘రాధే శ్యాం’,’ఓ డియర్’ లాంటి టైటిల్స్ వినిపిస్తున్నాయి. మరి వీటిలో మేకర్స్ ఏది ఫైనల్ చేశారన్నది తెలియాల్సి ఉంది. గోపి కృష్ణ మోవీస్ బ్యానర్ పై కృష్ణం రాజు సమర్పణలో యూ.వీ.క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ఇటివలే జార్జియా ఓ షెడ్యుల్ పూర్తి చేసుకొచ్చారు యూనిట్. త్వరలోనే మరో షెడ్యుల్ స్టార్ట్ చేస్తారు. ఈ ఏడాదిలోనే సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది.