నాని సినిమాతో మరోసారి?

Sunday,October 16,2016 - 01:14 by Z_CLU

తాజాగా ‘జెంటిల్ మన్’ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే అందర్నీ తనవైపు తిప్పుకున్న మలయాళీ భామ నివేత థామస్ మరో సినిమాతో అలరించాడనికి రెడీ అవుతుంది. ‘జెంటిల్ మన్’ తరువాత మరో సినిమాకు సైన్ చెయ్యని ఈ అమ్మడు తాజాగా ఓ సినిమా సైన్ చేసిందట.

gentleman_222

తాజాగా నివేత సైన్ చేసిన ఆ సినిమాలో హీరో మరెవరో కాదు నానినే. ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న ‘నేను లోకల్’ లో నటిస్తున్న నాని ఈ సినిమా తరువాత శివశంకర్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. డి.వి.వి.దానయ్య నిర్మించనున్న ఈ సినిమాలో నాని సరసన మరోసారి కథానాయికగా నటించనుందట ఈ ముద్దుగుమ్మ. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో రానున్న ఈ రెండో సినిమా మరో సూపర్ హిట్ అయితే టాలీవుడ్ హిట్ జంటల్లో నాని-నివేత కూడా చేరిపోవడం ఖాయం.