Gentleman - అర్జున్ హిట్ సినిమాకు సీక్వెల్

Thursday,September 17,2020 - 02:06 by Z_CLU

కేటి కుంజుమోన్ నిర్మాతగా మాస్టర్ డైరెక్ట‌ర్ శంకర్‌ దర్శకత్వం వ‌హించిన మొద‌టి సినిమా జెంటిల్ మేన్. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమా హీరో అర్జున్‌ కెరీర్‌లో మైల్ స్టోన్ గా నిలిచింది. విద్యావ్యవస్థలోని లోపాలపై పోరాడే ఓ యువకుడి కథతో తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద హిట్. మళ్లీ ఇన్నాళ్లకు Gentleman Sequel రెడీ అవుతోంది.

అవును.. జెంటిల్ మేన్ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు నిర్మాత కేటీ కుంజుమన్. అయితే ఈ ప్రాజెక్టుకు డైరక్టర్ ఎవరనే విషయాన్ని అతడు వెల్లడించలేదు. ఈ సినిమాతోనే శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మళ్లీ అతడే సీక్వెల్ చేస్తాడా లేదా అనేది డౌట్.

హీరోగా అర్జున్ ఫిక్స్ అయినప్పటికీ ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ మారబోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్-ఇండియా సినిమాగా జెంటిల్ మేన్-2ను నిర్మించబోతున్నారు.