'గీతగోవిందం' మెయిన్ హైలైట్స్

Monday,August 13,2018 - 07:44 by Z_CLU

భారీ అంచనాల మధ్య ఈనెల 15న విడుదలకానుంది ‘గీతగోవిందం’ సినిమా. విజయ్ దేవరకొండ, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతలా అందర్నీ ఆకర్షిస్తున్న గీతగోవిందం సినిమాలో స్పెషల్ ఏంటో చూద్దాం.

విజయ్ దేవరకొండ :

సినిమాపై ఈ రేంజ్ లో క్రేజ్ క్రియేట్ అవ్వడానికి ముఖ్యమైన రీజన్ విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ నుంచి ఫుల్ లెంగ్త్ లో వస్తున్న సినిమా ఇదే. మధ్యలో మహానటి వచ్చినప్పటికీ దాన్ని విజయ్ దేవరకొండ మూవీగా చూడలేం. అందుకే గీతగోవిందాన్ని విజయ్ ఫుల్ లెంగ్త్ మూవీ అన్నాం. ఇప్పటికే యూత్ లో అరివీర భయంకరమైన క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి ఇదే మెయిన్ రీజన్.

స్టోరీలైన్ :

ఈ సినిమాకి మరో ఎట్రాక్షన్ స్టోరీలైన్. ఇప్పటికే రిలీజైన టీజర్ ని బట్టి మ్యాగ్జిమం సినిమా, హీరో హీరోయిన్స్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే అగ్రెసివ్ మార్క్ క్రియేట్ చేసుకున్న దేవరకొండను డిఫెరెంట్ ఆంగిల్ లో ప్రెజెంట్ చేస్తుంది గీతగోవిందం. ఇక రష్మిక విషయానికి వస్తే, తన లైఫ్ పార్టనర్ విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకున్న అమ్మాయిలా ఎట్రాక్ట్ చేస్తుంది.

ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ :

విజయ్ దేవరకొండ – రష్మిక మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ విషయాన్ని ఇప్పటికే రిలీజైన టీజర్, స్టిల్స్ ఎలివేట్ చేస్తున్నాయి. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్, ఆడియన్స్ ను ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తాయి.

మ్యూజిక్ :

గీతగోవిందంపై ఇన్ని అంచనాలు పెరగడానికి మరో మెయిన్ రీజన్ సాంగ్స్. ఇప్పటికే పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మరీ ముఖ్యంగా “ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..” సాంగ్ అయితే ఇండస్ట్రీలో ఓ పెద్ద సంచలనం. ఆల్ టైం సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ పాటను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఆడియన్స్ అంతా తెగ వెయిటింగ్.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ :

ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే సహజంగానే ఆ ప్రాజెక్టుపై హైప్ క్రియేట్ అవుతుంది. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై తెరకెక్కింది గీతగోవిందం సినిమా. గీతాఆర్ట్స్ బ్యానర్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం భారీగా ఖర్చుపెట్టి కొన్ని సన్నివేశాల్ని రీషూట్ కూడా చేశామని స్వయంగా విజయ్ దేవరకొండ ప్రకటించాడంటే, సినిమా ఎంత రిచ్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

డైరక్షన్:

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎట్రాక్షన్ డైరక్షన్. ఈ సినిమాపై ఇన్ని అంచనాలు పెరగడానికి, సినిమా టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా మారడానికి ప్రధాన కారణం దర్శకుడు పరశురాం. ఈ సినిమా కోసం రాత్రిపగలు తేడాలేకుండా కష్టపడ్డాడు పరశురాం. ఇతడి సినిమాల్లో కనిపించే చిన్నపాటి మేజిక్ గీతగోవిందంలో కూడా కనిపిస్తుంది. ఫైనల్ గా ఇది డైరక్టర్స్ మూవీ అనిపించుకుంటుంది.