‘గీతగోవిందం’ ఇక బాలీవుడ్ లో...

Thursday,January 03,2019 - 02:03 by Z_CLU

గ్రాండ్ సక్సెస్ అంటే రియల్ మీనింగ్ ఇదేనేమో. ‘గీత గోవిందం’ రిలీజై ఇన్ని రోజులు కావస్తున్నా ఆడియెన్స్ అటెన్షన్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. అందుకే ఈ బ్లాక్ బస్టర్ ని రీమేక్ చేయడానికి బాలీవుడ్ లో కూడా  ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రీమేక్ కి సంబంధించి ఎగ్జాక్ట్ డీటేల్స్ అయితే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు కానీ, ఈ రీమేక్ కోసం  ఇషాన్ ఖతార్ ని అప్రోచ్ అయ్యారట మేకర్స్.

రీసెంట్ గా ‘ధడ్కన్’ సినిమాతో ఇంప్రెస్ చేసిన ఇషాన్, ఈ సినిమాకి ఆల్మోస్ట్ యస్ అన్నాడనే టాక్, బాలీవుడ్ లో గట్టిగానే చక్కర్లు కొడుతుంది. అయితే తెలుగులో పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, బాలీవుడ్ లో ఎవరి డైరెక్షన్ లో స్క్రీన్ కెక్కనుందా..? అనేదే ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం బాలీవుడ్ నేటివిటీ కి తగ్గట్టు స్క్రిప్ట్ ని మాడిఫై చేసే ప్రాసెస్ లో ఉన్న మేకర్స్, త్వరలో ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్ డీటేల్స్ ని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు.