40 కోట్ల క్లబ్ లో చేరిన దేవరకొండ

Thursday,August 23,2018 - 02:56 by Z_CLU

బ్లాక్ బస్టర్ హిట్ అయిన గీతగోవిందం సినిమా మరో రికార్డు సృష్టించింది. తాజా వసూళ్లతో ఈ సినిమా 40 కోట్ల క్లబ్ లోకి చేరింది. కేవలం 8 రోజుల్లో ఈ సినిమా 40 కోట్ల రూపాయల షేర్ సాధించడం ఓ రికార్డు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ 40 కోట్ల హీరోగా అవతరించాడు.

ఆగస్ట్ 15 హాలిడేస్ ను ఫుల్ గా క్యాష్ చేసుకున్న ఈ సినిమాకు బక్రిద్ సెలవు కూడా కలిసిరావడంతో జస్ట్ 8 రోజుల్లోనే 40 కోట్ల క్లబ్ లోకి ఎంటరవ్వగలిగింది గీతగోవిందం. ఇక మరో 4-5 రోజుల్లో ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి కూడా చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతానికి థియేటర్లలో గీతగోవిందానికి పోటీలేదు.

ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సినిమాలు కూడా దీనికి పోటీగా నిలవలేవనే టాక్ వినిపిస్తోంది. ఇలా కంప్లీట్ పాజిటివ్ వైబ్రేషన్స్ తో దూసుకుపోతోంది గీతగోవిందం సినిమా. మరోవైపు ఈ సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు తెలంగాణ ఎంపీ కవిత.