‘గీతగోవిందం’ దర్శకుడి కొత్త సినిమా

Wednesday,August 29,2018 - 03:15 by Z_CLU

‘గీతగోవిందం’ సక్సెస్ తో స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు పరశురామ్. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా థియేటర్స్ కి వచ్చేలా చేసింది. అయితే ఈ సక్సెస్ ఫీవర్ హీట్ తగ్గకముందే, తన నెక్స్ట్ సినిమా పై దృష్టి పెట్టాడు పరశురాం.

తన నెక్స్ట్ సినిమా హీరో ఎవరంటే ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్న పరశురాం, ఈ సినిమా మాత్రం కంపల్సరీగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉండబోతుందని క్లారిటీ ఇచ్చాడు. దేవుడికి, ఒక భక్తుడికి మధ్య రిలేషన్ షిప్ పై బేస్ అయి ఈ సినిమా ఉండబోతుందని కూడా చెప్పుకున్నాడు పరశురాం.

ఇప్పటికే ఈ సినిమా స్టోరీ పై ఫుల్ టైమ్ ఫోకస్ పెట్టిన పరశురాం, త్వరలో ఈ సినిమాకి సంబంధించి డీటేల్స్ అనౌన్స్ చేస్తామని చెప్పుకున్నాడు.  ఈ లెక్కన పరశురాం నెక్స్ట్ 100 కోట్ల హీరో ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.