పరశురామ్ ఇంటర్వ్యూ

Tuesday,August 28,2018 - 04:04 by Z_CLU

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా నటించిన ‘గీతగోవిందం’ యూత్ తో పాటు ఫ్యామిలీస్ కి తెగ నచ్చేసింది. ఇప్పటికే 100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, ఇప్పటికీ రిలీజైన సెంటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు మీడియాతో మాట్లాడాడు.

అందరికీ థాంక్స్…

‘గీతగోవిందం’ సక్సెస్ చాలా కాన్ఫిడెన్స్ నిచ్చింది. ఈ సినిమా నాకు దర్శకుడిగా పునర్జన్మనిచ్చింది. నాకీ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, వాసు గారికి, విజయ్ దేవరకొండకి అందరికీ థాంక్స్…

అది మీరే చెప్పాలి…

సినిమా 100 కోట్లు వసూలు చేసింది. దాంతో అందరూ నన్ను స్టార్ డైరెక్టర్ ని అయిపోయాను అంటున్నారు. నేను స్టార్ డైరెక్టర్ నో కాదో మీరే చెప్పాలి.

పూరి గారు అలా అన్నారు…

పూరి గారు సినిమా చూసి రైటింగ్ చాలా మెచ్యూర్డ్ గా ఉంది. నీ గత సినిమాల కన్నా ఈ సినిమా చాలా బావుందని అన్నారు.

సినిమా హిట్టవ్వడానికి రీజన్స్…

మంచి కథ కుదరడం, దానికి విజయ్ ఆడ్ అవ్వడం, రిలీజ్ కి ముందే హిట్టయిన ఆడియో, సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అనేలా క్యూరియాసిటీ జెరేట్ చేసింది. దానికి తోడు ప్రొడక్షన్ వ్యాల్యూస్, అన్నీ కలిసొచ్చి సినిమా హిట్టయ్యింది…

అంతా అల్లు అర్జున్ చేశాడు…

‘గీతగోవిందం’ కథ బన్నికి నచ్చిన కథ. అందుకే సినిమా బిగినింగ్ నుండి కథను పట్టించుకుంటూనే ఉన్నాడు. ప్రతి సీన్ అడిగి తెలుసుకునేవాడు. సినిమా హిట్టయ్యాక చాలా హ్యాప్పీ గా ఫీలయ్యాడు. కాబట్టే అంత పెద్ద పార్టీ ఇచ్చాడు.

నో ఇన్వాల్వ్ మెంట్…

వాసు గారు కానీ, అరవింద్ గారు కానీ ఒకసారి స్టోరీ ఫైనల్ అయిందంటే, మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వరు.. షూటింగ్ తరవాత ఎడిటింగ్ చేసేటప్పుడు నేను అడిగితే చూసి, ఒపీనియన్స్ చెప్తారు… అంతే.. ఎక్కడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు. నేను చూసుకుంటాను అని నమ్మకం వాళ్లకు.

నెక్స్ట్ – నో ఫాంటసీ

నెక్స్ట్ సినిమా వాసు గారికి స్టోరీ చెప్పాను. ఒక దేవుడికి, భక్తుడికి మధ్య ఉండే రిలేషన్ షిప్ బేస్డ్ స్టోరీ అదీ.. ఆ స్టోరీ పై ఇంకా వర్క్ చేస్తున్నా…. ఈ సినిమాలో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉండవు… ఈ సినిమా కూడా గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉంటుంది.