'గీతగోవిందం' డైరెక్టర్ పరశురాం ఇంటర్వ్యూ

Tuesday,August 07,2018 - 04:20 by Z_CLU

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా నటించిన ‘గీత గోవిందం’ ఈ నెల 15 న గ్రాండ్ గా రిలీజవుతుంది. బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే యూత్ లో పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న దర్శకుడు పరశురామ్, మీడియాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

ఇద్దరూ సమానమే…

సినిమాలో హీరోయిన్ డామినేషన్.. హీరో తగ్గి ఉండటం లాంటివేమీ ఉండవు. 2 క్యారెక్టర్స్ కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది.

సినిమాలో ఇద్దరి రోల్స్…

హీరో అప్పుడే స్టడీస్ కంప్లీట్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తుంటాడు. హీరోయిన్ IT ప్రొఫెషనల్. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ, మిస్ అండర్ స్టాండింగ్స్… ఇదే గీత గోవిందం…

గీత గోవిందం అంటేనే అదీ…

మహాభారతం లో రాధ, శ్రీకృష్ణుడు మధ్య ఉండే లవ్, అలకలు, వాళ్ళిద్దరి మధ్య ఉండే ఇమోషనల్ ఎలిమెంట్స్ నే  ‘గీతగోవిందం’  అంటారు. దానిని బేస్ చేసుకునే ఈ కథ రాసుకోవడం జరిగింది.

దేనికదే…

విజయ్ దేవరకొండ కి అగ్రెసివ్ ఇమేజ్ ఉన్నా, సినిమాలో చాలా సెన్సిబుల్ రోల్ ప్లే చేశాడు. వ్యాల్యూస్ ని నమ్మే  వ్యక్తిలా కనిపిస్తాడు…

నాకు అలా అనిపించలేదు…

కథ, క్యారెక్టర్.. అదే మ్యాటర్… ఇమేజ్ అనేది నేను పట్టించుకోను. అర్జున్ రెడ్డి తరవాత విజయ్ దేవరకొండ కి ఎలాంటి ఇమేజ్ ఉన్నా, ఆ సినిమా కూడా లవ్ ఎంటర్ టైనరే… ఇప్పుడు ‘గీతగోవిందం’ కూడా లవ్ ఎంటర్ టైనరే.. కాబట్టి విజయ్ ఈ సినిమాలో కూడా అంతే మెస్మరైజ్ చేస్తాడు.

అందుకే రష్మిక మండన్న…

‘ఛలో’ రిలీజ్ కన్నా ముందే రష్మికకు కథ చెప్పడం జరిగింది. స్టోరీ వినేటప్పుడే చాలా ఇన్వాల్వ్ అయిందనిపించింది. అందుకే రష్మిక  అయితేనే బెటర్ అని ఫిక్సయ్యాం…

బన్నికి నా కథలంటే ఇష్టం…

బన్నికి ఎప్పుడు బోర్ కట్టినా, నా చేత కథలు చెప్పించుకుంటూ ఉంటాడు. నేను చెప్పే కథలంటే తనకి చాలా ఇష్టం…

నాక్కూడా ఉంది…

బన్నితో సినిమా చేయాలనే ఆలోచన నాక్కూడా ఉంది. ఇప్పటికే నా దగ్గర 2, 3, ఐడియాలు ఉన్నాయి. కాకపోత్ ఏఒక సినిమా అవ్వాలంటే అన్ని కుదరాలి అప్పుడే పాసిబుల్ అవుతుంది. బన్ని తో సినిమా చేయగలిగితే చాలా అచీవ్ చేసినట్టే…