గీతగోవిందం ఆడియో రిలీజ్ ఫంక్షన్.. గ్రాండ్ సక్సెస్

Monday,July 30,2018 - 01:05 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ గీతగోవిందం. విజయ్ దేవరకొండ, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆడియోను రాత్రి గ్రాండ్ గా రిలీజ్ చేశారు. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ వేడుకకు గెస్ట్ గా వచ్చి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది.

గీతగోవిందం సినిమాను ఇప్పటికే చూశానని ప్రకటించాడు బన్నీ. ఓ సామాన్య ప్రేక్షకుడిగా సినిమాను చూశానని, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవీని ఫుల్ గా ఎంజాయ్ చేశానని అంటున్నాడు. రెండేళ్ల కిందటే ఈ సినిమా కథ నాకు తెలుసని, సినిమా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్నాడు బన్నీ.

గీతగోవిందంలో తను పాడిన ఓ పాట క్రియేట్ చేసిన సంచలనం గురించి విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ సాంగ్ కొంతమందిని ఇబ్బంది పెట్టిందని, అందుకే లిరిక్స్ మార్చి మళ్లీ తనే పాడానని క్లారిటీ ఇచ్చాడు దేవరకొండ. ఆడియో ఫంక్షన్ కు తన రౌడీ బ్రాండ్ లుంగీతో వచ్చి అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు దేవరకొండ.

స్టేజ్ పై తన మేనరిజమ్స్, డైలాగ్స్ తో రఫ్ఫాడించాడు విజయ్ దేవరకొండ. తను పూర్తిగా మారిపోయానని చెప్పిన విజయ్, స్టేజ్ పై పెద్దలతో పాటు రష్మిక కాళ్లకు కూడా మొక్కి అందర్నీ నవ్వించాడు. తనలో వచ్చిన మార్పు అందరూ చూడాలనుకుంటే.. ఆగస్ట్ 15న గీతగోవిందం సినిమా చూడాలని కోరాడు.

హీరోయిన్ రష్మిక చక్కగా తెలుగులో మాట్లాడి అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. సినిమా చాలా బాగా వచ్చిందని, అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూడాలని కోరింది.

ఇలా ఎంతో ఉత్సాహభరితంగా సాగింది గీతగోవిందం ఆడియో ఫంక్షన్. బన్నీ, విజయ్ దేవరకొండ అభిమానుల సమక్షంలో ఈ సినిమా పాటల్ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు.