ఈరోజే గీతగోవిందం ఆడియో లాంఛ్

Sunday,July 29,2018 - 09:45 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ గీత గోవిందం సాంగ్స్ మరికాసేపట్లో మార్కెట్లోకి రాబోతున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో ఇప్పటికే ఓ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. యూట్యూబ్ లో 10 మిలియన్ వ్యూస్ కు పైగా వచ్చాయి. ఇప్పుడు అదే ఊపులో ఈరోజు ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ పాటల వేడుకను  సాయంత్రం 7 గంటల నుంచి జీ సినిమాలు ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

గీతగోవిందం సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించాడు. అనంత శ్రీరామ్, శ్రీమణి ఈ సినిమాకు సాహిత్యం సమకూర్చారు. పాటలన్నీ వేటికవే ప్రత్యేకంగా వెరీ వెరీ స్పెషల్ గా కంపోజ్ అయ్యాయి. స్వయంగా స్టయిలిష్ స్టార్ బన్నీ ఈ ఆడియో రిలీజ్ వేడుకకు ప్రత్యేక అతిథిగా వచ్చి, తన చేతుల మీదుగా గీతగోవిందం పాటల్ని విడుదల చేయబోతున్నాడు.

పరశురాం డైరక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.