గీతగోవిందం: బ్లాక్ బస్టర్ వసూళ్లు

Saturday,August 18,2018 - 11:08 by Z_CLU

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, బ్యూటిఫుల్ రష్మిక జంటగా నటించిన గీతగోవిందం సినిమా కళ్లుచెదిరే వసూళ్లతో దూసుకుపోతోంది. నిన్నటితో 3 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రెండో రోజుకే బ్రేక్-ఈవెన్ సాధించి, మూడో రోజు నుంచి లాభాల బాటపట్టింది గీతగోవిందం.

ఈరోజు రేపు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టిక్కెట్లన్నీ బుక్ అయిపోయాయి. ఆక్యుపెన్సీ 80 శాతానికి పైగా ఉంది. సో.. ఈ వసూళ్లు కూడా కలుపుకుంటే గీతగోవిందం సినిమాకు 5 రోజుల్లో వరల్డ్ వైడ్ 22 కోట్ల రూపాయల షేర్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 5.01 కోట్లు
వైజాగ్ – రూ. 1.34 కోట్లు
సీడెడ్ – రూ. 2.01 కోట్లు
ఈస్ట్ – రూ. 1.09 కోట్లు
వెస్ట్ – రూ. 0.97 కోట్లు
కృష్ణా – రూ. 1.04 కోట్లు
గుంటూరు – రూ. 1.29 కోట్లు
నెల్లూరు – రూ. 0.44 కోట్లు