గాయత్రి డైరెక్టర్ మదన్ ఇంటర్వ్యూ

Friday,February 02,2018 - 06:21 by Z_CLU

డా. మోహన్ బాబు నటించిన సినిమా గాయత్రి. ఫిబ్రవరి 9 న రిలీజవుతున్న ఈ సినిమాలో మంచు విష్ణు పవర్ ఫుల్ రోల్ ప్లే చేశాడు. ఈ మూవీ డైరెక్టర్ మదన్ రామిగాని ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

అదే గాయత్రి సినిమా….

మనిషి జీవితంలో కష్ట సుఖాలు రెండూ ఉంటాయి. ఆ రెండింటితో ముడిపడి ఉండేదే గాయత్రి సినిమా. డిఫెరెంట్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా గాయత్రి.

మంచు విష్ణు క్యారెక్టర్…

సినిమాలో ఒక మోహన్ బాబు క్యారెక్టర్ కి యంగర్ వర్షన్ మంచు విష్ణు ప్లే చేశాడు. ఇంతకు మించి సినిమా రిలీజ్ కి ముందు ఈ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేస్తే థ్రిల్ మిస్ అవుతాం.

 

అదే సినిమా కథ…

తండ్రీ కూతుళ్ళ మధ్య ఉండే బాండింగ్, వాళ్ళిద్దరి మధ్య ఉండే ఎఫెక్షనే ఈ సినిమా. మోహన్ బాబు గారి కూతురు గాయత్రిగా నిఖిల విమల్ నటించింది.

మోహన్ బాబు గొప్ప నటుడు…

N.T.R, A.N.R. S.V.రంగారావు, శివాజీ గణేషన్ స్థాయి నటుడు మోహన్ బాబు గారు. ఆయన స్థాయికి కథలు రాయగలగాలి.

గర్వంగా ఫీలవుతున్నా….

కేవలం ఒక్క సిట్టింగ్ లో ఓకె చెప్పేశారు. అంతకు ముందు కనీసం ఆయనకు నాకు పరిచయం కూడా లేదు. అంత గొప్ప నటుడితో పనిచేసే అవకాశం దొరకడం అదృష్టంగా ఫీల్ అవుతున్నా…

జాగ్రత్త పడతారు…

ఒకరకంగా గాయత్రి సినిమా మోహన్ బాబు గారికి రీలాంచ్ లాంటిదే. కాబట్టి ఆయనకు ఉండే ప్రెజర్ ఆయనకుంటుంది. అందుకే ఆయనకు తోచిన సలహాలు ఇచ్చేవారు. కానీ సలహా ఇచ్చిన ప్రతిసారి ఆచి తూచి చెప్పేవారు. ఏదో అస్తమానం ఇన్వాల్వ్ కాకుండా.. జెన్యూన్ గా ఉంటుంది ఆయన ఫీడ్ బ్యాక్.

 

ఇమోషన్ ఇంపార్టెంట్….

ఫ్యామిలీ డ్రామాలేవీ చూసినా పాతగానే అనిపిస్తుంటాయి. గాయత్రిలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండటంతో కాస్త రొటీన్ ఆగా అనిపించవచ్చు కానీ, ఏ సినిమాకైనా కావాల్సింది ఇమోషన్… గాయత్రి లో కావాల్సినంత ఇమోషన్ ఉంటుంది.

తక్కువ సినిమాలు…

నేనెప్పుడూ సినిమా మేకింగ్ ని రేసింగ్ ప్రాసెస్ లో చేయలేదు. కుదిరినప్పుడే చేశాను… అందుకే తక్కువ  సినిమాలు చేశాను.

నెక్స్ట్ సినిమా….

ఇంకా స్క్రిప్ట్ స్టేజ్ లోనే ఉంది నా నెక్స్ట్ సినిమా… ఈ ఇయర్ నా నెక్స్ట్ రిలీజ్ కంపల్సరీగా ఉంటుంది. ఎవరితో చేస్తున్నాననేది త్వరలో రివీల్ చేస్తాను..