గౌతమ్ నంద రిలీజ్ డేట్ ఫిక్స్

Thursday,July 06,2017 - 01:09 by Z_CLU

సంపత్ నంది డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా నటిస్తున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గౌతమ్ నంద’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. గోపీచంద్ రెండు డిఫెరెంట్ షేడ్స్ లో ఎట్రాక్ట్ చేయనున్న ఈ సినిమా జూలై 28న థియేటర్స్ లో రిలీజవుతుంది. డైరెక్టర్ సంపత్ నంది ఆ విషయం కన్ఫం చేశాడు.

హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన క్యాథరీన్, హన్సిక  హీరోయిన్స్ గా నటించారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని J. పుల్లారావు, J. భగవాన్ కలిసి నిర్మిస్తున్నారు.