గౌతమ్ మీనన్ డ్రీం ప్రాజెక్ట్ సెట్స్ పైకి...

Monday,January 09,2017 - 05:25 by Z_CLU

గౌతమ్ మీనన్ డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చేసింది. విక్రమ్ హీరోగా చాలా రోజుల నుండి, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న డైరెక్టర్, మొత్తానికి  ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చేశాడు. ఈ వెంచర్ కి ‘ధృవ నక్షత్రం’ అని టైటిల్ ని కూడా ఫిక్స్ చేసేశాడు.

సాహసం శ్వాసగా సాగిపో తరవాత గౌతమ్ మీనన్ యాక్షన్ చెప్పిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలనుకుంటుంది సినిమా యూనిట్. చెన్నై లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విక్రమ్ జాన్ గా కనిపిస్తున్నాడు.