శరవేగంగా సిద్ధమౌతున్న శాతకర్ణి

Friday,November 11,2016 - 06:00 by Z_CLU

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. అందుకే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని తేదీల్ని ప్రకటించే ఆలోచనలో ఉన్నారు.

   గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ట్రయిలర్ ను డిసెంబ‌ర్ 9న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియోను డిసెంబ‌ర్ 16న తిరుపతి లో గ్రాండ్ గా రిలీజ్ చేయ‌నున్నార‌ని టాక్. ఇక సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేస్తామనే విషయాన్ని దర్శకుడు క్రిష్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ డ్రీమ్ గాళ్ హేమమాలిని కీలకపాత్ర పోషిస్తోంది. శాతకర్ణి తల్లి బాలశ్రీ పాత్రలో హేమమాలిని కనిపించనుంది. అటు శాతకర్ణి భార్యగాా వశిష్ట దేవి పాత్రలో శ్రియ మెరవనుంది.