గౌతమీపుత్ర శాతకర్ణి ట్రయిలర్ రివ్యూ

Friday,December 16,2016 - 06:07 by Z_CLU

నందమూరి నటసింహం బాలయ్య అభిమానులకు సంక్రాంతి ఈరోజు నుంచే ప్రారంభమైంది. ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి ట్రయిలర్, కరీంనగర్ లో అట్టహాసంగా విడుదలైంది. అశేష నందమూరి అభిమానగణం మధ్య విడుదలైన బాలయ్య  వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ట్రయిలర్… ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకుంటోంది.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే…  ముందుగా చెప్పుకోవాల్సింది నటసింహం గురించే. చేస్తోంది వందో సినిమానా లేక ఇదే మొదటి సినిమానా అనేంత ఎగ్రెసివ్ గా కనిపించాడు బాలయ్య. సినిమా మొత్తం నటసింహం ఆవరించేసింది. ఆ మీసకట్టు, దుస్తులు, నడక, రౌద్రం… ఒకటేంటి, ఇలా చెప్పుకుంటూ పోతే ట్రయిలర్ తోనే అభిమానుల కడుపు నింపేశాడు బాలయ్య బాబు. సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేశాడు.

బాలయ్య సినిమాలంటే అదిరిపోయే డైలాగ్స్ ఉండాల్సిందే. మరి చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణిలో డైలాగులు ఉంటాయా.. మాస్ ను అలరిస్తారా.. ఇలా ఎన్నో సందేహాలు. ఇలాంటి డౌట్స్ అన్నీ ఈ ట్రయిలర్ తో పటాపంచలైపోయాయి. ట్రయిలర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్స్  అదుర్స్.

gps

బాలయ్య తర్వాత కచ్చితంగా అభినందించి తీరాల్సిన వ్యక్తి దర్శకుడు క్రిష్. అతి తక్కువ టైమ్ లో అదిరిపోయే ఔట్ పుట్ ఇచ్చిన క్రిష్ ను తప్పకుండా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక సినిమాలో శ్రియ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉందదే విషయాన్ని ట్రయిలర్ తో స్పష్టంగా చెప్పేశారు. అటు మ్యూజిక్ డైరక్టర్ చిరాంతన్ భట్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్స్ టార్డనరీగా ఉంది. జార్జియాలో తీసిన యుద్ధసన్నివేశాలు టోటల్ సినిమాకే హైలెట్ అనే బజ్ ఎప్పట్నుంచో నడుస్తోంది. అది నిజమేనని ట్రయిలర్ చూస్తే అర్థమైపోతుంది. ఓవరాల్ గా గౌతమీపుత్ర శాతకర్ణి ట్రయిలర్ అదిరిపోయింది. ఇప్పటివరకు ఉన్న అంచనాల్ని వందరెట్లు పెంచేసింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానున్న శాతకర్ణి ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.